చంద్రబాబుకు తెలిసే తిరుమలలో తెలంగాణ లేఖల తిరస్కరణ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

చంద్రబాబుకు తెలిసే తిరుమలలో తెలంగాణ లేఖల తిరస్కరణ

•     విధానపరమైన నిర్ణయాన్ని అధికారులు సొంతంగా తీసుకోలేరు

•     ఆంధ్ర, తెలంగాణ రెండు కళ్లన్న చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

టీటీడీ లోని తెలంగాణ బోర్డు మెంబర్లు ఈ విషయంగా వత్తిడి తీసుకురావాలి
టీటీడీ తీరుమారకపోతే తెలంగాణలోని ఆలయాల్లోనూ ఆంధ్ర నేతలకు అదే ట్రీట్ మెంట్ 
WhatsApp Image 2024-12-24 at 17.31.53

లోకల్ గైడ్ న్యూస్ మిడ్జిల్ 
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండా తీసుకొనే అవకాశం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా రెండూ కూడా తనకు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఎలా చూపుతారని ప్రశ్నించారు.
                          గతంలో ఆంధ్ర ప్రజాప్రతినిధుల తరహాలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా భక్తులకు దర్శన, వసతి సదుపాయాలను టీటీడీ కేటాయించేది. అయితే ఈ మధ్యకాలంలో టీటీడీలో తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు చెల్లుబాటుకాకపోవడం, ఈ విషయంగా అనిరుధ్ రెడ్డి తిరుమలకు వెళ్లిన సమయంలో మీడియాలో మాట్లాడటం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన ఆంధ్ర మంత్రి ఒకరు టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత ఈ విషయంగా సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రకటించి వెళ్లారు. కానీ టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత కూడా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలని టీటీడీకి మరోసారి విజప్తి చేసారు. తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా తెలంగాణా ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ తీసుకున్నది విధానపరమైన నిర్ణయం కాగా ఈ నిర్ణయాన్ని టీటీడీ ఈఓ సొంతంగా తీసుకోలేరని దీనికి సీఎం అనుమతి అవసరమౌతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా తనకు రెండు కళ్లని గతంలో చెప్పిన చంద్రబాబు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా ఆమోదిస్తారని నిలదీసారు. ఒకవేళ సీఎంకు తెలియకుండా టీటీడీ అధికారులే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేసారు. తిరుమల ఆలయానికి ఆంధ్ర భక్తుల కంటే తెలంగాణా భక్తులే అధికంగా వెళ్తారని, టీటీడీకి భక్తుల ద్వారా సమకూరే ఆదాయంలో ఎక్కువ భాగం తెలంగాణా భక్తుల నుంచే వస్తుందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీలో పరిగణలోకి తీసుకొనేలా నిర్ణయం తీసుకోవాలని  కోరారు. ఈ విషయం గురించి తెలంగాణాకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వత్తిడి తీసుకురావాలని అనిరుధ్ సూచించారు. ఈ విషయంలో ఏపీ సీఎం, టీటీడీ అధికారుల ధోరణి మారకపోతే తెలంగాణాలోని జోగుళాంబ నుంచి బాసర దాకా, భధ్రాచలం నుంచి చిలుకూరి బాలాజీ దాకా తెలంగాణలో ఉన్న అన్ని ఆలయాల్లో ఆంధ్ర వీఐపీల సిఫార్సు లేఖలను ఆమోదించకూడదని, వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించకూడదని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతామని, అసెంబ్లీలోనూ ఈ విషయంగా నిర్ణయం తీసుకొనేలా చూస్తామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా టీటీడీ, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా ప్రజాప్రతినిధులను కూడా గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌.... ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌....
లోక‌ల్ గైడ్: ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్...
తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!