వికారాబాద్  జిల్లా ఎంప్లాయిమెంట్  కార్యాలయంలో జాబ్ మేళా

వికారాబాద్  జిల్లా ఎంప్లాయిమెంట్  కార్యాలయంలో జాబ్ మేళా

లోకల్ గైడ్ వికారాబాద్:-                                              
స్టెఫిన్గ్ టైటాన్స్ ప్రైవేట్ లిమిటెడ్(స్టాఫ్ఫింగ్ టైటన్స్ ప్రైవేట్ లిమిటెడ్ )
 నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని  
జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటన తెలిపారు.
 జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ వికారాబాదు నందు జనవరి  08 బుధవారం  ఉదయము 10:30 గంటలకు " జాబ్ మేళా " ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

స్టెఫిన్గ్ టైటాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఐదు కంపినీలు 1) బిగ్ బాస్కెట్(Big Basket) , 2)స్విగ్య్ (Swiggy), 3)జిఫ్టో(Zepto), 4) యురేకా ఫోర్బ్స్(Eureka Forbes),     5) డి మార్ట్(Dmart)  ఈ ఐదు కంపినీలలో వేర్హౌస్ అసోసియేట్ , స్టోర్ ఎగ్జిక్యూటివ్ ,షిఫ్ట్ ఇంచార్జి క్యాషియర్ /సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సుమారు 200 లకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఇట్టి ఉద్యోగానికి పదవ తరగతి, ఇంటర్ డిగ్రీ, విద్యా అర్హత కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి ఉద్యోగాలు హైదరాబాద్   లో ఉన్నాయని తెలిపారు.
ఈ ఐదు ప్రైవేటు పరిశ్రమల యజమాన్యము తమ పరిశ్రమలకు అవసరమగు సిబ్బందిని ఈ జాబ్ మేళ ద్వారా ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ 9676047444 ద్వారా సంప్రదించవచ్చునని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News