ఆదిలాబాద్ పార్లమెంటరీ మీటింగ్ హాజరైన....
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
లోకల్ గైడ్: ఆదిలాబాద్ పార్లమెంటరీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ప్రోటోకాల్ చీఫ్ హర్కార వేణు గోపాల్, ఎమ్మెల్సీ దండె విఠల్, జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, టీపీసీసీ సెక్రటరీ సత్తు మల్లేష్ ,మాజీ ఎంపీ వేణుగోపాల చారి, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితర నేతలు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డితో కలిసి స్థానిక మార్వాడి ధర్మశాలలోని వేంకటేశ్వర ఆలయాన్ని దర్శించారు.ఆలయ ప్రధాన అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.అతిథులకు ఆలయ విశిష్టతను తెలిపారు.అనంతరం చేతులకు కంకణాలు ధరింప చేసి శాలువాలతో సత్కరించారు.తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
Comment List