త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..!

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..!

లోక‌ల్ గైడ్: ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు. సింగపూర్‌లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు.తెలంగాణ రాష్ట్రం క్రీడా రంగంలో కీలకమైన అడుగులు వేయబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ, దేశంలోని అత్యంత ఆధునిక స్థాయిలో లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన భారీ స్టేడియాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్‌సిటీలో లేదా మరో ప్రాంతంలో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
క్రీడారంగంలో తెలంగాణకు కొత్త ఒరవడి
తెలంగాణలో ఇప్పటికే 760 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర క్రీడారంగానికి దిశానిర్దేశం చేయనుంది. క్రీడలకు సంబంధించిన ప్రణాళికలు, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, సమగ్ర విధానం అమలులోకి తెచ్చే యోచనలో ఉంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News