డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్
లోకల్ గైడ్: డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో NSUI అధ్యక్షుడు మేడ శ్రీను ఆధ్వర్యంలో డ్రగ్స్ ను రూపుమాపే ఆవశ్యకతను తెలియజేస్తూ స్థానిక NCC గేటు నుండి ఆర్ట్స్ కాలేజీ ఆవరణ వరకు 2K రన్ నిర్వహించారు.
' మత్తు వదలరా మిత్రమా ' అనే ట్యాగ్ లైన్ ప్లకార్డులను చేబూని విద్యార్థులు, యువత ఉత్సాహంగా రన్ లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై రన్ ను ప్రారంభించగా, డీసీపీ బాలస్వామి, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ గారు మాట్లాడుతూ.. యువత విలువలతో కూడిన జీవితంఅనుభవించాలన్నారు. సమాజానికి హానికరంగా మారిన డ్రగ్స్ ను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుతాడి కుమార్ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,కొండ నాగేశ్వరరావు సర్
ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్,చింతల నిర్మలారెడ్డి,మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి,శ్రీనివాస్,అప్కార శాఖ డిఎస్పి,డాక్టర్ శాంతి,సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్,జానకి రెడ్డి,నిజం కాలేజ్ ప్రొఫెసర్,కుందన్, శ్రీకర్, నర్సా గౌడ్, మణికంఠ,వినయ్, సాయి,ఓంకార్,వంశీ,వెంకట్ ,ముదిరాజ్,సురేష్, రవి, అభిలాష్, ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List