ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. ప్రకటించనున్న ఈసీ....
లోకల్ గైడ్ : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది.మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది. ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. దీంతో నెల రోజుల ముందుగానే ఎన్నికల ప్రక్రియను ఈసీ మొదలు పెట్టనుంది.
అధికారం నిలుపుకోవాలని ఆప్, ఈసారైనా ఢిల్లీ గద్దెనెక్కెలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనే హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, గత రెండు పర్యాయాలు కేజ్రీవాల్ ( నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీఘన విజయం సాధించింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్ ఖరారు చేసింది. న్యూఢిల్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి అతిశీ మరోసారి కల్కాజీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు.
Comment List