సీఎం పేరు తెల్వనోడు యాంకర్ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం
By Ram Reddy
On
లోకల్ గైడ్ / హైదరాబాద్: తెలుగు మహా సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ బాలాదిత్యపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలవని వాళ్లు యాంకర్ అవుతారా అంటూ మండిపడ్డారు. తెలుగు మహాసభలు పెట్టిన వారికి బుద్ధి లేదా, అసలు ఆ సభలు పెట్టింది ఎవరంటూ ఫైరయ్యారు. ఎంపీగా ఉన్న నేనే పేపర్లలో రాసుకుని చదువుతున్నా.. ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఏ సీఎం వస్తున్నడో తెలియకుండా యాంకర్ చదువుతడా అని విమర్శించారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఎదో కుట్ర ఉందన్నారు.
Tags:
Comment List