ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం : సిఎం రేవంత్ రెడ్డి

ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం : సిఎం రేవంత్ రెడ్డి

లోక‌ల్ గైడ్ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్‌డీపీ కింద చేప‌ట్టిన‌ ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీతో పాటు ప‌లువురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే త‌ర్వాత న‌గ‌రంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవ‌ర్ ఇదే.హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్‌ ప్రభుత్వం సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. హెచ్‌ఎండీఏ, ఆర్‌ అండ్‌ బీ శాఖ ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు చేపట్టింది. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు.. రూ.799.74 కోట్లతో ఆరాంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు ఆరు లేన్లతో119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జూపార్కు ఫ్లై ఓవర్‌ 23వ ఫ్లై ఓవర్‌ కాగా, ఇప్పటికే 14 చోట్ల ఆర్వోబీ, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఐదు చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్‌ నాటికల్లా ఎస్‌ఆర్‌డీపీ పూర్తి ఫలాలు అందుబాటులోకి తేస్తామని అధికారులు తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News