తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 

 హర్షం వ్యక్తం చేసి, అభినందించిన  మాజీ జెడ్పిటిసి పల్లె నర్సింగ్ రావు 

తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 

లోకల్ గైడ్ / కేశంపేట:కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె అంజయ్య సువర్ణ దంపతుల కుమారుడు పల్లె మధుసూదన్ తెలంగాణ జెన్కో (ఏఈ) అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీ జెన్కో లో 300 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా... 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యగలకు పోటీ పరీక్ష నిర్వహించగా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన  పల్లె మధుసూదన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించారు. సెక్రటేరియట్ నియామక పత్రం అందజేశారు.  జెన్కో  లో ఉద్యోగం సాధించిన మధుసూదన్ ను కేశంపేట మాజీ జెడ్పిటిసి పల్లె నర్సింగ్ రావు హర్షం వ్యక్తం చేసి,  అభినందించారు. ఉద్యోగం సాధించడం తనకెంతో సంతోషం ఇచ్చిందని మధుసూదన్ తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News