అద్వితీయ భరితంగా అభిమాన నాయకుని జన్మదిన వేడుకలు....
లోకల్ గైడ్ / శేరిలింగంపల్లి: గోపనపల్లి లోని కార్పొరేటర్ కార్యాలయం వద్ద గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలలో గచ్చిబౌలి డివిజన్ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు "జై గంగాధర్" నినాదాల మధ్య ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి, పుష్పగుచ్చాలతో సత్కరించి, శాలువాలు కప్పి అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల భాగంగా కార్పొరేటర్ గారు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తనపై చూపిస్తున్న ప్రేమకు, నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజల ఆశీర్వాదాలు తనకు శక్తిని, ప్రేరణను అందిస్తున్నాయని, మరింత కష్టపడి ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడం తన లక్ష్యమని చెప్పారు. ఈ వేడుకలు డివిజన్ ప్రజల్లో ఆనందాన్ని నింపగా ఒక పండుగ వాతావరణంలో ముగిసాయి.
Comment List