టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు

  టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు

 లోక‌ల్ గైడ్:  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Race Case) కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసులో దూకుడు పెంచారు. ఫార్ములా-ఈ కేసులో పలుచోట్ల ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, మచిలీపట్నంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. మాదాపూర్‌లోని ఏస్ నెక్స్ట్‌జెన్, ఏస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ సోదాలు చేసింది. గ్రీన్‌కో, అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకు ఎన్నికల బాండ్లు వెళ్లడంపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రూ.41కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఏసీబీ ఆరా తీస్తోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News