చైనా సరిహద్దులో శివాజీ విగ్రహం.. ఆవిష్కర‌ణ 

లోక‌ల్ గైడ్ : తూర్పు లడఖ్‌ సెక్టర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. పాంగాంగ్‌ సో సరస్సు తీరంలో, సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ హితేష్‌ భల్లా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ ఔన్నత్యం నిరంతరం స్ఫూర్తిదాయకమని లేహ్‌లోని 14 కోర్‌ ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపింది. ధైర్యసాహసాలు, ముందుచూపు, చెక్కు చెదరని న్యాయాలకు ప్రతీక శివాజీ అని కొనియాడింది. ఇదిలా వుండగా, ఇటీవల చిట్టచివరి ఘర్షణ ప్రాంతాలైన దెమ్‌చోక్‌, డెప్సాంగ్‌ల నుంచి భారత్‌, చైనా తమ సైన్యాలను ఉపసంహరించాయి. దీంతో దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి తెర పడింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!  అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
లోక‌ల్ గైడ్ : BJP కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. DyCM DK శివకుమార్ లేకుండా CM సిద్దరామయ్య అతిథిగా మంత్రుల మీటింగ్స్ జరుగుతున్నాయి. రాత్రి మీటింగ్స్...
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం
అభివృద్ధి, సంక్షేమమే నా ధ్యేయం 
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..!
శ్రీ‌తేజ్ ను చూడ‌గానే పుష్ప రియాక్ష‌న్ ......