అభివృద్ధి, సంక్షేమమే నా ధ్యేయం
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్ల పల్లి శంకర్"
లోకల్ గైడ్: ఆరోగ్యం చెడిపోతే ముఖ్యమంత్రి ఆదుకునే నిధులు.. వీటికోసం నిరుపేద కుటుంబాల ఎదురుచూపు.. ఆ సమయం రానే వచ్చింది ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వస్తున్న చెక్కుల కోసం ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తూ చెక్కులను తీసుకొని ఆనందంగా జేబులో పెట్టుకొని వెళ్తున్న సందర్భాలు..
ఎవరి కళ్ళలో చూసిన చెక్కులు తీసుకున్న సంతోషం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంగళవారం ఎంతో మంది మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పెద్ద ఎత్తున అందజేశారు. ఇవి తీసుకోవడానికి లబ్ధిదారులు వందలాదిగా తరలివచ్చారు.
దీంతో షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులో ఉబీలో నెట్టి రాష్ట్రాన్ని దివాళా తీసారని మండిపడ్డారు. కేశం పెట్ ,కొందుర్గ్ మండలానికి సంబదించిన136 మందికి రూ.1,36,15,776 ల కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను మరియు 30మంది లబ్దిదారులకు రూ. 13,93.500- ల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేశారు. అర్హులైన ప్రతి లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా పథకాల్లో తమ రాజకీయ లబ్ది కొరకు అమలు చేశారాని ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ మండిపడ్డారు. ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని అన్నారు. ఒకే రోజు దాదాపు 1కోటి 50 లక్షల పై చిలుకు చెక్కులను అందిచడంచాలా సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వొద్దని సభ ముఖంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, తిరుపతి రెడ్డి, బస్వమ్, ఇబ్రహీం, శ్రీను నాయక్, హుస్సేన్, బి గోవర్ధన్ గౌడ్ కొందుర్గు మండల్ లోకల్ గైడ్ రిపోటర్ పట్లోళ్ల వెంకటేశ్వర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Comment List