చ‌ర్ల‌ప‌ల్లి ట‌ర్మిన‌ల్ ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ 

చ‌ర్ల‌ప‌ల్లి ట‌ర్మిన‌ల్ ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ 

లోక‌ల్ గైడ్: చ‌ర్ల‌పల్లి ట‌ర్మిన‌ల్ ను ప్ర‌ధాని మోదీ వ‌ర్చువ‌ల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 
జంట నగరాల్లో ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, సిటీ శివార్లలో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది రైల్వే శాఖ. భారీ వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్‌… అత్యంత విశాలంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కొలువుదీరింది. ఎయిర్‌పోర్ట్‌ లుక్‌తో కనిపించే చర్లపల్లి రైల్వే స్టేషన్‌…ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.

9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇది హైదరాబాద్‌లో నాల్గో అతి పెద్ద రైల్వే స్టేషన్‌. మొత్తం రూ. 430 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్‌లో మొత్తం 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌ రేంజ్‌లో టెర్మినల్‌ నిర్మాణం జరిగింది. హైదరాబాద్‌లో వందేళ్ల తర్వాత మరో అతి పెద్ద రైల్వే స్టేషన్‌…ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సిద్ధం కావడంతో…సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News