జాతీయస్థాయి కరాటే లో బూర్గుల విద్యార్థుల ప్రతిభ

జాతీయస్థాయి కరాటే లో బూర్గుల విద్యార్థుల ప్రతిభ

లోకల్ గైడ్ /షాద్ నగర్ : షాద్ నగర్ కుంట్ల రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ వ్యవస్థాపకులు కరాటే లెజెండరీ గ్రాండ్ మాస్టర్ క్రీస్తు శేషులు మల్లేష్ యాదవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగిన 38వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో ఫరూక్నగర్ మండలం జడ్.పి.హెచ్.ఎస్ బూర్గుల పాఠశాలకు చెందిన విద్యార్థులు మెగావత్ సాయి చరణ్,మెగావత్ సాయి వర్ధన్ ఫాల్త్యవత్ గణేష్ పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీ హీరో కరాటే లెజెండ్ సుమన్ చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల అసెంబ్లీలో స్కూల్ ప్రిన్సిపాల్ రవికుమార్, కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News