హోలీ సంబరాల్లో  పాల్గొన్న యువతి యువకులు 

హోలీ పండుగ స్నేహానికి సంతోషానికి ప్రతీక

హోలీ సంబరాల్లో  పాల్గొన్న యువతి యువకులు 

లోకల్ గైడ్ తెలంగాణ,మిడ్జిల్:
 
మిడ్జిల్ మండల కేంద్రంలో, వివిధ గ్రామాలలో శుక్రవారం ఘనంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ రంగుల కేళి అంటూ   యువతి యువకులు చిన్నా పెద్ద తారతమ్మం లేకుండా అందరూ ఆనందంగా  ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు  తెల్లవారుజాము నుంచే గ్రామాలలో  పురవీధులలో యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి హోలీ సంబరాలు చేసుకున్నారు. గురువారం రాత్రి కాముని దహన కార్యక్రమంలో ప్రతివాడలలో యువత యువకులు పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ రంగుల హోలీ లో   వివిధ సంఘాల నాయకులు  పెద్దలు  కులమతాలకు తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకున్నారు.రంగుల పండుగ హోలీ, అందరి జీవితాలను రంగులతో  నింపాలని ఈ హోలీ నాడు  కష్టాలన్నీ తొలగిపోవాలని జీవితం ఆనందమయం  కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.