అర్జున్ S/O వైజయంతి టీజర్ విడుదల..
లోకల్ గైడ్:
పవర్ ఫుల్ లుక్‌లో విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి . కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి . కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తోంది. కర్తవ్యం సినిమాలో విజయశాంతి పేరు వైజయంతి కాగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే పేరు పెట్టారు. ఈ మూవీలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గానే కనిపిస్తోంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టని వైజయంతి కొడుకు విషయంలో ఏం చేసింది అనే కోణంలో సాగే కథలా సినిమా ఉంటుందని టీజర్‌ని చూస్తే అర్ధమవుతుంది.10 సంవత్సరాల నా కెరీర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతీసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం.. నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. నెక్స్ట్ బర్త్ డే నాటికి పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కొడుకుని కోరుతుంది. కాని లాఠీ చేతపట్టాల్సిన అర్జున్.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టుకొని రౌడీల మీద యుద్ధానికి బయలుదేరినట్లు టీజర్ లో చూపించారు.టీజర్‌లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయ్యేలా కట్ చేశారు. అయితే హీరోయిన్ ను పూర్తిగా సైడ్ చేశారు. విజయశాంతి చెప్పిన డైలాగ్స్ చూస్తే ఆమెకి కొడుకు అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, ఎమోషన్స్, సెంటిమెంట్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. ఏది ఏమైన టీజర్ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెంచేసింది. మీరు టీజర్‌పై ఓ లుక్కేయండి.
Comment List