నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమా అయినా కథ బాగుంటే దానిని తెలుగు ప్రజలు బ్లాక్ బస్టర్ చేయడంలో ముందుంటారు. కథ లేకుండా పాన్ఇండియా లెవెల్ లో సినిమా తీసిన దానిని ఫ్లాప్ చేసేదాకా వదలరు. తాజాగా నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా 'కోర్ట్'. ఈ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదలయ్యి సెన్సేషనల్ టాక్ తో బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు హీరో నాని ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మీకు నచ్చకపోతే... మరో రెండు, మూడు నెలలలో రిలీజ్ అయ్యే నేను నటించిన హిట్ 3 సినిమా ఎవరు చూడొద్దని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. నాని చేసిన వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకొని చాలామంది థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా బ్లాక్బస్టర్ అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా కేవలం బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా వసూళ్లలోనూ దూసుకుపోతుంది. తక్కువ బడ్జెట్, పెద్ద నటులు లేకపోవడం తో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఏమి ఆడుతుంది లే అని అనుకున్నారు. కానీ వాటన్నిటికీ సమాధానమే ఇవాళ ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు. విడుదలైన మూడు రోజులకే 24 కోట్ల వసూలను రాబట్టి చరిత్ర సృష్టించింది. రాము జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలలో నటించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ లోను 600k డాలర్లు రాబట్టి మరో రికార్డు సృష్టించిందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.
Comment List