బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి

 బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి

లోకల్ గైడ్:ఒంటరిగా కూర్చుని ఏడవలేను! బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.. ఆటగాళ్ల కుటుంబాలను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లే విషయంలో బోర్డు విధించిన ఆంక్షలపై స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.. ఆటగాళ్ల కుటుంబాలను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లే విషయంలో బోర్డు విధించిన ఆంక్షలపై స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు కష్టసమయాల్లో కుటుంబ మద్దతు ఎంతో అవసరమని, తానైతే హోటల్‌ రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడవలేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు. శనివారం బెంగళూరులో జరిగిన ఆర్‌సీబీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ సమ్మిట్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘కుటుంబం పాత్ర గురించి, వాళ్లు ఇచ్చే మద్దతు గురించి కొంతమందికి ఎంతచెప్పినా అర్థం కాదు.మ్యాచ్‌లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. ఆట పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరితే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేగానీ మ్యాచ్‌ ముగిశాక హోటల్‌ రూమ్‌లోకి ఒక్కడే వెళ్లి విచారిస్తూ కూర్చోవాలా? నేనైతే అలా చేయలేను. ఆట ముగిసినా నేను సాధారణంగానే ఉండాలని కోరుకుంటా. కుటుంబంతో గడిపే ఏ ఒక్క క్షణాన్ని నేను వదులుకోను’ అని కుండబద్దలు కొట్టాడు. 45 రోజుల విదేశీ పర్యటనలైతే రెండు వారాలు మాత్రమే కుటుంబాలకు అనుమతినిచ్చిన బీసీసీఐ.. చిన్న టూర్లకు తీసుకెళ్లకపోవడమే మంచిదన్నట్టు సూచించింది. ఇటీవలే ముగిసిన చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత ఆటగాళ్ల కుటుంబాలు దుబాయ్‌లో ఉన్నప్పటికీ వారంతా క్రికెటర్లతో కాకుండా ఇతర హోటళ్లలో ఉండాల్సి వచ్చింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?