జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.

జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

లోకల్ గైడ్ తెలంగాణ,భూపాలపల్లి జిల్లా ప్రతినిధి:
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేసంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఏకవచనంతో  సభ నీ సొంతం కాదు అంటూ మాట్లాడి గౌరవ స్పీకర్ స్థానాన్ని  ఆగౌరపరిచిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని  డిమాండ్ చేస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్  అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటిఆర్, జగదీష్ రెడ్డి ల దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సతీష్ గౌడ్   మాట్లాడుతూ..
బహుజనుడు స్పీకర్ స్థానంలో ఉండడాన్ని కేసీఆర్ అండ్ కంపని ఓర్వలేక పోతున్నారని స్పీకర్ స్థానాన్ని అగౌరపరిచిన జగదీష్ రెడ్డి  మాట్లాడిన మాటలే నిదర్శనం గౌరవ ప్రధానమైన స్థానం స్పీకర్ స్థానం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగపు స్థానమని ఆ స్థానాన్నె అగౌరపరిచిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మొదటి నుంచి కెసిఆర్ పార్టీ విధానమే బడుగు బలహీన వర్గాలను అవమాపరుస్తూనే ఉన్నారని దళిత బహుజనులు అంటే ఇంత అలుసా ఎందుకింత అహంకారం అధికారం పోయినా దొరతనపు అహంకారం ఇంకా తగ్గలేదని అన్నారు. బడుగు బలహీన వర్గాలు లేకుండానే మీరు ఎమ్మెల్యేగా గెలిచారా  మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన  జగదీశ్  రెడ్డికి శాసన సభను స్పీకర్ స్థానానికి గౌరవించాలని తెలియదా అని ప్రశ్నించారు.
ఒక దళితుడు స్పీకర్ స్థానాల్లో కూర్చోవడం టిఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదని అన్నారు.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకుడిగా ఉన్న దళితుడైన బట్టి విక్రమార్కుని కూడా ఇలానే అవమానపరిచారు. ప్రతిపక్ష పాత్ర లేకుండా కాంగ్రెస ఎమ్మెల్యేలను టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన గనుడు కేసీఆర్ కాదా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి కులగణన చేపడితే కనీసం సర్వేలో కూడా కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదు అంటే వీళ్ళకు బీసీల పట్ల  దళితులపట్ల  ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుందని అన్నారు. దృత ర్రాష్ట్రుని కౌగిలిల కెసిఆర్  అండ్ కంపని వ్యవహరిస్తుందని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 56 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని శాసనసభలో తీర్మానం చేస్తే దాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడారని  ఆయన విమర్శించారు. దళితులు బడుగు  బలహీనర్గాల పట్ల మీ వైకిరిని మార్చుకోక పోతే  టిఆర్ఎస్  కేసీఆర్ కుటుంబాన్నితెలంగాణ సమాజం క్షమించదని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్, యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపల్లి వీరేశం, బొల్లికొండ రాజయ్య మండల ఉపాధ్యక్షులు మాదం కొమురయ్య,కనుమరుగుల సదయ్య,మండల ప్రధాన కార్యదర్షులు దాసరపు సదానంద,బండి రవి,ఎడ్ల రమేష్,వివర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆడెపు సంపత్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లద్దునూరి ఐలయ్య,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొల్గూరి అనిల్,మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కుమ్మరి రమాదేవి,అధ్యక్షులు పేరుమాండ్ల క్రాంతి,గొల్లపల్లి వెంకటేశ్వర్లు,గజ్జి రమేష్,అల్లం ఓదెలు మండల నాయకులు పోల్ దాసరి రాజేశం,వంగ కుమార స్వామి,కూర వెంకట రాజి రెడ్డి, వంగ నరేష్, ఏలబోయిన రాజేందర్, సోరుపాక సదానందం,కోరే చందు,నల్లబెల్లి మొండయ్య,దాసరి కుమార స్వామి,కురె ప్రభాకర్, దుర్గయ్య,మండల యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల నరేందర్,ఇరవేణ అజయ్, బొండ్ల మహేష్ ,జంగిటి రాజు, భాషవెన రాజేందర్, కౌడగాని అనిల్,పెసరు విఘ్నేష్,కూర అజయ్ సింహ రెడ్డి, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ చిలక రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.