ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలి
•జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో
లోకల్ గైడ్ తెలంగాణ,మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (రెవెన్యూ) అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి తో కలసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాల వారితో సమన్వయ పరుస్తూ దరఖాస్తుదారులకు దిశా, నిర్దేశము చేసి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన జర్పుల జ్యోతి లక్ష్మి తనకు వివాహమై ఇద్దరు పిల్లలు నాపై ఆధారపడి ఉన్నారని, తను వికలాంగురాలినని, ఆసరా పెన్షన్ మాత్రమే నాకు ఆసరా అని కానీ నా ఇద్దరు పిల్లలతో ఆసరా పెన్షన్ సరిపోక ఇబ్బంది పడుతున్నానని బ్రతుకు దెరువుకు, ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కేందుకు ఏదైనా ఉపాధి ఇప్పించగలరని కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని 4వ వార్డు గాందీపురానికి చెందిన గందమల్ల నర్సయ్య గుమ్మూనురు శివారు లోని 287 సర్వే నందు ఉన్న తన 3 ఎకరాల 6 గుంటల భూమిలో 2 ఎకరాల 6 గుంటల భూమిలో మునిసిపల్ అధికారులు అక్రమంగా నర్సరీ, గుంతలు తీస్తున్నారని తనకు న్యాయం చేసి తన భూమిని ఇప్పించాలని కోరారు.మహబూబాబాద్ పట్టణంలో పలు ప్రయివేటు విద్యాసంస్థలలో బెస్ట్ ఆవేలబుల్ స్కీం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం ద్వారా విద్యార్థుల బిల్స్ రావడం లేదని ఇంటికి పంపించారని సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన సోమారపు లింగయ్య దంతాలపల్లి సూర్యపేట ప్రధాన రహదారిలో మద్యం షాపు ఉండడం వలన దగ్గర్లోని నివాస ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అట్టి షాపును తరలించి నివాస ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.ఈ విధంగా వివిధ శాఖల కు చెందిన (69 ) మొత్తం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పి సీఈఓ పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, సిపిఓ సుబ్బారావు, ఎడి సర్వే ల్యాండ్ నరసింహమూర్తి, జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్, హార్టికల్చర్ అధికారి మరియన్న, గ్రౌండ్ వాటర్ డిడి సురేష్, వెల్ఫేర్ అధికారిని ధనమ్మ, మత్స్య శాఖాధికారి వీరన్న, మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, వివిధ మండలాల డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
Comment List