ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెలంగాణ పాలడుగు ప్రభావతి పిలుపు
నల్లగొండ జిల్లా బ్యూరో .
లోకల్ గైడ్ తెలంగాణ..
మహిళలకు 2500/-రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ తో ఈనెల 28 న నల్గొండ జిల్లా కార్యాలయ ముందు జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి పిలుపునిచ్చారు. ఈరోజు కనగల్ మండలం పర్వతగిరి, దర్వేషిపురం గ్రామాలలో సమగ్ర సర్వే నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ప్రభావతి మాట్లాడుతూ మహిళల కు ప్రతినెలా 2500/- ఇస్తామన్నా గ్యారంటీ ఏమైనడని ప్రశ్నించారు. ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు. బస్సు, గ్యాస్, మినహా ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని తెలిజేశారు.భూమి సమస్యలు సంవత్సరాలు గడిచిన పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. వృత్తి దారులకు ఆర్థిక సహకారం అందించి ఆడుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు నెలగొండరాశి లింగయ్య ఎండీ సుల్తానా రాములు లింగయ్య వెంకటయ్య శ్రీరాములు నర్సింహా సైదులు వెంకన్న పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List