ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్
సౌతాఫ్రికా క్రికెటర్‌కు పాక్ బోర్డు నోటీసులు
లోకల్ గైడ్:
సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్‌కు..పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది.పాక్ సూపర్ లీగ్‌ను వదిలేసి..ఐపీఎల్‌లో ఆడేందుకు ముంబై ఇండియన్స్‌తో అతను జతకలిశాడు.దీంతో ఆగ్రహంగా ఉన్న పాక్ బోర్డు ఆ ప్లేయర్‌కు నోటీసులు ఇచ్చింది.ముంబై :సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్ కు..పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది.పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందుకు..షెషావర్ జల్మీ జట్టుకు అతను ఎంపికయ్యాడు.అయితే ఆ జట్టును వదిలేసి అకస్మాత్తుగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడేందుకు వచ్చేశాడు.దీంతో ఆ ప్లేయర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉంది.కార్బిన్ బోష్ చర్యల పట్ల పీసీబీ సంతృప్తిగా లేదు.ముంబై ఇండియన్స్ జట్టులో సౌతాఫ్రికా ప్లేయర్ లిజార్డ్ విలియమ్స్ గాయపడ్డాడు.అయితే అతని స్థానంలో కార్బిన్ బోష్‌కు ముంబై జట్టు ఛాన్సు ఇచ్చింది.కానీ ముందే పాకిస్థాన్ టీ20 లీగ్‌లో ఆడేందుకు ప్రిపేరైన కార్బిన్..ముంబై నుంచి ఆఫర్ రావడంతో..ఆ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.దాదాపు ఒకే షెడ్యూల్‌లో పీఎస్ఎల్,ఐపీఎల్ ఉండడంతో..ఇండియన్ ప్రీమియర్ లీగ్ వైపు కార్బిన్ మొగ్గుచూపాడు.
Comment List