రోడ్డుకు ఇరువైపులా పొంచి ఉన్న ప్రమాదాలు..
జల్లే జయరాజు సిఐటియు మండల కార్యదర్శి.
లోకల్ గైడ్ తెలంగాణ,కేసముద్రం: ఆదివారం రోజున కేసముద్రం మున్సిపాలిటీ పరిధి నుండి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు వేసిన డాంబర్ రోడ్డును సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు పరిశీలించిన అనంతరం, మాట్లాడుతూ.. కేసముద్రం మండలo నుండి ఇంటికన్నె ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం డాంబర్ రోడ్డు నిర్మించినారు. కానీ డాంబర్ రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయ బావులు ఉన్నాయి. డాంబర్ రోడ్డు పోసి ఇరువైపులా వాల్సు నిర్మించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చే విధంగా ఉందన్నారు. గత నెలలో వెంకటగిరి నుంచి ఇంటికన్నె వెళ్లే రహదారిలో ఇంటికన్నె నివాసి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి రహదారికి ఇరువైపులా బావులు ఉన్నచోటల్లా ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, అదేవిధంగా గోడలు నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను కోరారు.
Comment List