తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు కావలి దీపా గొప్ప పేరు తెచ్చింది.
డిసిసి ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్.
అభినందించిన పరిగి వాకింగ్ అసోసియేషన్ సభ్యులు
కావలి దీపను సన్మానించిన వాకింగ్ అసోసియేషన్.
తండ్రిగా చాలా గర్వంగా ఉంది.
వికారాబాద్ జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ ప్యారా మీలిటరీ ప్రెసిడెంట్ కావలి లింగం ముదిరాజ్.
లోకల్ గైడ్ తెలంగాణ ,పరిగి.
ఆల్ ఇండియా వాటర్ స్పోర్ట్స్ బోట్ ఛాంపియన్ షిప్, 24వ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ మధ్యప్రదేశ్ భూపాల్ లో నిర్వహించిన పోలీస్ శాఖకు సంబంధించిన పోటీలలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన కావలి దీపా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా డి సిసి ప్రధాన కార్యదర్శి కే. హనుమంతు ముదిరాజ్ కావలి దీపకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పరిగి వాకింగ్ అసోసియేషన్ సంఘం సభ్యులు కావలి దీపకు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.మున్ముందు కావలి దీపా మరిన్ని విజయాలు సాధించాలని వాకింగ్ అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. నా కూతురుకు ఈశ్వరుని కృపతో పాటు మీ అందరి అభిమానం ఎల్లవేళలా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎక్సెస్ సర్వీస్ మెన్ ప్యారా మిలిటరీ ప్రెసిడెంట్ కావలి లింగం ముదిరాజ్ తెలిపారు. ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా వారన్నారు.
Comment List