సావిత్రి బాయి పూలే స్ఫూర్తిని కొనసాగిద్దాం
మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్.
లోకల్ గైడ్,హనుమకొండ జిల్లా ప్రతినిధి:
హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో సావిత్రి బాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు. మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మొదట సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాలకు విద్యనందించేందుకు కృషి చేసిన మహనీయురాలు అని కొనియాడారు.వివక్ష ఎదురవుతున్నా విద్యనందించేందుకు పోరాడిన యోధురాలు సావిత్రి బాయి పూలే అని తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలేతో కలిసి బహుజనుల బాగు కోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రి బాయి పూలే అని అన్నారు. మహిళల చదువు కోసం విశేష కృషి చేసిన గొప్ప మాతృమూర్తి, చైతన్య దీప్తి, విద్యా జ్యోతి సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. కాంగ్రెస్ బీసీలను, మహిళలను మోసం చేసిందని విమర్శించారు. హక్కుల సాధన కోసం బీసీలు, మహిళలు ఏకతాటిపైకి వచ్చి పోరాడుదామని పిలుపునిచ్చారు.
Comment List