సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..

సిపిఎం రాష్ట్ర నేత పి, సోమయ్య..

సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..

లోకల్ గైడ్ తెలంగాణ,కారేపల్లి:

కూలి - పోడు పోరాటాల్లో  సమరశీల కార్యకర్తగా ప్రజలను సమీకరించి పోరాడే నాయకురాలిగా కీలక పాత్ర పోషించిన ఘనత పడిగ అనంతమ్మదని సిపిఎం రాష్ట్ర నాయకులు పి సోమయ్య అన్నారు. మాణిక్కారం మాజీ ఎంపీటీసీ, సిపిఎం సీనియర్ సభ్యురాలు పడిగ అనంతమ్మ అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో సిపిఎం మండల కార్యదర్శి కే నరేంద్ర అధ్యక్షతన సంతాప సభ జరిగింది. అనంతమ్మ మృతదేహంపై పార్టీ జెండాను పి సోమయ్య, దండను పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ వేసి పూలు తల్లి నివాళులర్పించారు. మాణిక్యారం ప్రాంతంలో పార్టీని నిర్మించడం, విస్తరించడములో శత్రువులు పోరాటాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో ఉద్యమాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషించిందని కొనియాడారు. అనంతమ్మ ప్రజాప్రతినిధిగా ఎంపికవడమే ఆమె ప్రజల మనిషి అనడానికి నిదర్శనం అని, భూస్వామ్య శక్తుల నుండి పార్టీని కాపాడే దాంట్లో ముందుండి అనంతమ్మ కుటుంబంతో పాటు వారి సంతానం కమ్యూనిస్టు పార్టీలోనే కడవరకు కొనసాగిందని ఎలాంటి పరమరికలు లేకుండా నేడు పూటకు కండువా రోజుకో పార్టీ మారుతూ నిబద్ధతలేని రాజకీయాలు నడుస్తున్న క్రమంలో కడవరకు ఎర్రజెండా నీడన పేద ప్రజల కోసం పనిచేసిన అనంతమ్మ జీవితం ధన్యమైనదని,ఆమె ఆశయాల బాటలో ముందుకు పోవడమే అనంతమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మెరుగు రమణ,కొండబోయిన నాగేశ్వరరావు,ఉమావతి, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు వజ్జ రామారావు, పార్టీ సీనియర్ నాయకులు అనంతమ్మ సోదరులు కరపటి వీరస్వామి,సీతారామయ్య,లక్ష్మయ్య, కురసం సీతారాములు, ఎర్రవోడు మాజీ సర్పంచ్ కురసం సత్యనారాయణ,బోనగిరి  యాదగిరి, చరప వీరస్వామి, కేశగాని రామ్మూర్తి,పోలేపల్లి కృష్ణ, కల్తి రామచంద్రయ్య, సొసైటీ మాజీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు, కురసం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.