ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో వుంటూ సేవలందిస్తాం
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
లోకల్ గైడ్,వరంగల్ జిల్లా ప్రతినిధి :
నిరంతరం ప్రజలకు సేవలదిస్తూ 24 x 7 ప్రజలకు అందుబాటు లో వుంటామని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ఉత్తర్వుల మేరకు వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్‌కు డిసిపిలు, అదనపు డిసిపిలు పుష్పాగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం నూతన పోలీస్ కమిషనర్‌గా పూర్వ సిపి అంబర్ కిషోర్ ఝా నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అంబర్ కిషోర్ ఝా నూతన పోలీస్ కమిషనర్ కు పుష్పాగుచ్చాలను అందజేసి, అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వంద శాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా ఇరువై నాలుగు గంటలు ప్రజల కొసం పనిచేస్తామని, ప్రధానంగా నేరాల నియంత్రణతో పాటు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకై కృషి చేస్తామని, ప్రస్తుతం పోలీసులు ఎదుర్కోంటున్న సవాళ్ళు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడితో పాటు మత్తు పదార్థాల వినిగయోగించేవారు, విక్రయించేవారి పట్ల కఠినంగా వ్యవహరించబడుతుందని, ముఖ్యంగా మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని. రాబోవు రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేయడం జరుగుతుందని నూతన పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమీషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసిన వారిలో డీసీపీ లు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏ. ఎస్పీ చైతన్య, అదనపు డీసీపీ లు రవి, సురేష్ కుమార్ తో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు ఇతర విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది వున్నారు.
Comment List