దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 

అయినా దేశ రాజకీయాలను ఏల‌లేకపోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 

లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు వేదికైన హైదరాబాద్ను మళ్ళీ 12వ తెలుగు మహాసభలకు వేదికవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అయినప్పటికీ దేశ రాజకీయాలను పోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందర్నీ ఈ సమైక్య ఏకం చేసిందన్నారు .కాంగ్రెస్ విధానాలతోనే నేడు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింద న్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతుంది అన్నారు. కోవిడ్ టైంలో తెలుగు వాళ్ళ సత్తా ప్రపంచానికి తెలిసిందని, కోవిడ్ వ్యాక్సిన్ ను మన తెలుగు వాళ్లే తయారు చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రపంచంతో పోటీ పడాలని, మనలో మనం పోటీ పడకూడదు అని అన్నారు.  రైతు రుణమాఫీ జీవో తెలుగులో ఉండేలా చూసుకున్నామని ఈమధ్య వీలైనంత జీవోలను తెలుగులోఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని  అన్నారు ముందు ముందు న్యాయస్థానాల్లో కూడా  వాదనలు తీర్పులు తెలుగులో ఉండాలి అని ఆకాంక్షిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News