పాఠశాలల పురోభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
పాఠశాలల పురోభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
లోకల్ గైడ్ కొల్లాపూర్, : పిల్లలకు కుటుంబమే మొదటి బడి.. తల్లిదండ్రులే తొలి గురువులు.. వారి పాత్రే పిల్లల అభ్యాసానికి కీలకమని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా కార్యకలాపాల్లో పాల్గొనాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సింగోటంలో రూ. 40 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఆధునీకరించిన ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ భవనాలను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన చర్చిద్దాం.. విద్యార్థుల భవిష్యత్ కోసం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. పిల్లల ఉన్నత చదువులు, వారి భవిష్యత్ కోసం ప్రభుత్వం పరంగా చేయాల్సింది ఎంటీ?, మీరేం చేయాలో సలహాలు సూచనలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులో మంత్రి ముచ్చటించారు. త్రిభుజ, వృత్త వైశాల్యాన్ని ఎట్లా కొలుస్తారని విద్యార్థులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యా బోధన అందిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామని అన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. తల్లిదండ్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ. 10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో రూ. 8 కోట్లు విద్యాభివృద్ధికే కేటాయించినట్లు చెప్పారు.
సంస్కృతి ద్వంసమైంది. ప్రస్తుత సమాజంలో ఎన్నో పెడధోరణులను చూస్తున్నామని, వీటన్నింటికి ప్రధాన కారణమని మన సంస్కృతి ద్వంసం కావడం, విలువలు నశించడమే అని అన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, చదువుతో పాటు విద్యార్థులకు సంస్కారం, నడవడిక కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందరి ఆలోచన ధోరణులు మారాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఉద్ఘాటించారు. సమయపాలన, సరియైన ప్రణాళికలతో చదువుల్లో విద్యార్థులు రాణించాలని సూచించారు. సాంకేతికతను సక్రమ పద్ధతిలో వినియోగించుకోవాలని కోరారు.
Comment List