అందుకే కేటీఆర్‌పై అక్రమ కేసులు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

 అందుకే కేటీఆర్‌పై అక్రమ కేసులు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

లోక‌ల్ గైడ్: రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అరాచకాలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత  మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల తరఫున ఎవరు తమ గళం వినిపించినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నదని ఆమె మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై రేవంత్ సర్కారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నదని, అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆరోపించారు.ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించి రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని కవిత విమర్శించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News