నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ

లోకల్ గైడ్: నల్లగొండ మదర్ చిల్డ్రన్ హెల్త్ సెంటర్ కు  ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో భారీగా వైద్య పరికరాలు అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.గర్భిని స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏ ఎన్ సి భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.ఆదివారం అయన నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆంటినేటల్ పరీక్షల భవన పనుల నిర్మాణానికి పూజ  చేశారు.గర్భస్థ  పరీక్షల నిమిత్తం ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు , అంతేకాక ప్రసవానికి ముందు ఆసుపత్రిలో చేరే వారు, వారి సహాయకులకు అనువుగా ఉండేందుకుగాను ఈ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని ,అంతేకాక సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు.అనంతరం మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులను,విభాగాలను  పరిశీలించారు. పోస్ట్ నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు .అలాగే పోస్ట్ నేటల్   వార్డులో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏ సి లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత తల్లి ,బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు ,ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు  ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆస్పత్రిలో పనిచేసే  పలువురు డాక్టర్లు,స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాలలో  డిప్రెషన్ పై పని చేస్తూన్నారని తెలుసుకున్న మంత్రి ఆస్పత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకుని  ఆస్పత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గైనిక్, జనరల్ సర్జన్, స్టాఫ్ నర్సుల కొరతను తీరుస్తామని ఆయన ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. 

       ఇంతకు ముందే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15  నైస్ నియోటెక్ వార్మర్లను, 10 నియో ఫోటో తెరఫీ సింగిల్ సర్ఫేస్ యూనిట్లను, 10 ఆకాష్  సైరింగ్ పంపులను, 5 నెల్ కార్ పల్స్  ఆక్షీమీటర్లను, 2 ట్రాన్స్క్యూటేనియస్ బిలురుబినేటర్లు , 100 మిట్టెన్స్, 100 బూటీలు, 200 స్వద్దే బ్లాంకెట్లు, 4 బబుల్ సిపిఎపి కంప్రెసర్లు,  మూడు నియోనటల్ రెస్క్యూటేషన్  కిట్లు, నాలుగు ఎన్ఐబిపి యూనిట్లు,  13 లీటర్ల ఆటోక్లేవ్, 4 రూమ్ టెంపరేచర్ థర్మామీటర్లు అందించిన మంత్రి ఈ రోజు ఆంటినేటల్ వార్డ్ ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎంహెచ్ఓ డాక్టర్ పొట్ల శ్రీనివాస్, డిప్యూటీ  డి ఎం హెచ్ ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిజిహెచ్ ఇన్చార్జి సూపరింటిండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వందన,డాక్టర్ స్వరూపా రాణి, తదితరులు ఉన్నారు.అనంతరం మంత్రి స్థానిక ఐటిఐ లో నిర్మాణంలో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!  అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
లోక‌ల్ గైడ్ : BJP కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. DyCM DK శివకుమార్ లేకుండా CM సిద్దరామయ్య అతిథిగా మంత్రుల మీటింగ్స్ జరుగుతున్నాయి. రాత్రి మీటింగ్స్...
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం
అభివృద్ధి, సంక్షేమమే నా ధ్యేయం 
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..!
శ్రీ‌తేజ్ ను చూడ‌గానే పుష్ప రియాక్ష‌న్ ......