అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
శ్రీ కాళికాదేవి అమ్మవారిని దర్శించుకున్న షాద్ నగర్ మిత్ర బృందం
లోకల్ గైడ్: తాండూర్ పట్టణం శ్రీ కాళికాదేవి అమ్మవారిని షాద్ నగర్ పట్టణానికి చెందిన మిత్రబృందం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. సోమవారం శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయంలో ఈవో నరేందర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి.మోహన్ రెడ్డి, ఆగిర్యాల మాజీ డిప్యూటీ సర్పంచ్ చక్రం రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, సీనియర్ జర్నలిస్ట్ వి.మల్లికార్జున్ నాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు విజయ్ పంతులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఈఓ నరేందర్ శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల ప్రతి ఒక్కరూ శుభ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. శ్రీ కాళికాదేవి అమ్మవారు ఎంతో మహత్యం కలదని అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని అదేవిధంగా కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారుగా ఎంతో ప్రాచుర్యం కలదని అన్నారు. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వారు కోరారు.
Comment List