రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్
లోకల్ గైడ్: ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు కాదు ప్రమాణపత్రాలు ఇవ్వాల్సింది.. రేవంత్ రెడ్డి ఇవ్వాలి అని కేటీఆర్ సూచించారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీలు ఇచ్చారు. ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడేమో రైతులు ఊర్లలో ప్రమాణపత్రం ఇవ్వాలట. ఇంతకంటే విచిత్రమైన ముచ్చట వినలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రజాపాలన అని కింద అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం కోటి 6 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మరి ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా..? ఇప్పుడేందుకు కొత్తగా రైతులను ప్రమాణపత్రాలు అడుగుతున్నారని కేటీఆర్ అడిగారు.
Comment List