మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
బహుమతులు అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
లోకల్ గైడ్ : ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా మహిళలు తెలుగు పండుగల సంప్రదాయాలను పాటించడం ముఖ్యంగా సంక్రాంతి లాంటి పండుగ సందర్భాల్లో ముత్యాల ముగ్గులు వేసి సమాజాన్ని ఆహ్లాదపరచడం ఎంతో గొప్ప విషయమని దీనికి విశేషంగా తనవంతు కృషి చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యానికి అభినందనలు అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణములోని బుగ్గారెడ్డి గార్డెన్ లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇంచార్జ్ మధు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, శతాబ్ది టౌన్షిప్ అధినేత శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య, మాజీ జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతల బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారి ముగ్గులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ సులోచన కృష్ణ రెడ్డి,వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, శతాబ్ది టౌన్ షిప్ అధినేత శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, తిరుపతి రెడ్డి,అగ్గనూర్ బస్వo, బాలరాజు గౌడ్,తదితరులు లతో కలిసి ఎమ్మెల్యే ముగ్గులను పరిశీలించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ...ముగ్గుల పోటీలు నిర్వహించి పండుగల సంస్కృతిని కాపాడుకునేందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయం అని తెలిపారు. తెలుగు వారి సంస్కృతి, పండుగలు కనుమరుగవుతున్న ఈ కాలంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అవసరమని తెలిపారు. పలువురు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి సంక్రాంతి సేవల గురించి ప్రస్తావిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు యువతులు ఆటపాటలతో అలరించారు.
Comment List