మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 

మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి

 లోకల్ గైడ్ :- కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ , డిఇఓ రేణుకాదేవి, జిల్లా అధికారులు, విద్యార్థినీలతో కలిసి జిల్లా కలెక్టర్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజల గావించి  నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎందరో మహనీయులు భవిష్యత్తు తరాల నిమిత్తం ఎన్నో ఒడి దుడుకులను  తట్టుకొని, తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు.  ఇందులో భాగంగానే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలను అరికడుతూనే.. మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన సంఘ సంస్కర్తలని కలెక్టర్ కొనియాడారు. మహిళలకు విద్య ద్వారానే సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని గ్రహించ గలుగుతారనే సదుద్దేశంతో 1848 సంవత్సరంలోనే మొట్ట మొదటి మహిళా పాఠశాలను నెలకొల్పి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తిని పొందిన సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరికి  ఆదర్శమని కలెక్టర్ తెలిపారు.  సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థినీలకు కలెక్టర్ సూచించారు.  సమాజంలో ఎలాంటి వివక్షకు తావునీయకుండా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని సూచించిన సావిత్రిబాయి పూలే కలలను నెరవేర్చవలసిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొన్ని విషయాల్లో వివక్షకు గురవుతున్న క్రమంలో వాటిని రూపుమాపాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు. 
        ఈ కార్యక్రమంలో డిపిఓ జయసుధ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ చెన్నమ్మ, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి , ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సత్తార్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం