క్రీడలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతాయి
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
లోకల్ గైడ్: క్రీడల పోటీలు ప్రజల మధ్య ఐక్యతను చాటుతాయని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. జిల్లేడు చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గ్రామంలో గత ఐదు యేండ్లు గా క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. క్రీడలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతాయని, నేటితరం యువకులు, బాల బాలికలు చదువుతోపాటు తమకిష్టమైన క్రీడారంగంలో రాణించాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని, అందుకు గ్రామస్తుల సహకారం కూడా ఉండాలని అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హఫీజ్, మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాజీ సర్పంచ్ బాబూరావు, మాజీ ఎంపీటీసీలు సత్య ప్రమోద్, మానయ్య, రాములు నాయకులు జబ్బార్, శేఖర్, పాండు, నర్సింలు, వెంకట్రాములు, మోతిలాల్, సలీం, జబ్బార్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గౌస్, శేఖర్, సత్యం, చందు తదితరులు పాల్గొన్నారు.
Comment List