హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు
లోకల్ గైడ్: హుస్నాబాద్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేసారు. ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచిన తరువాత హాస్టల్ లలో అమలవుతున్న కామన్ డైట్ పై ఆరా తీశారు. ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిన తరువాత తమకి నాణ్యమైన ఆహారం అందుతుందని కామన్ డైట్ లో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.మెనూ లో ఎక్కడ ఇబ్బంది రావద్దని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని కుటుంబాన్ని వదిలి వచ్చి దూరంగా చదువుకుంటున్న వారికి తల్లిదండ్రుల మాదిరిగా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఇంటర్మీడియట్ ఉన్న మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల ను డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. వారికున్న పలు సమస్యల పై మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ తాఫ్సిర్ ఇక్బాల్ ,ముఖ్యమంత్రి సెక్రటరీ షానవాజ్ కాసిం లతో విద్యార్థినులతో మాట్లాడించారు. విద్యార్థినులు చదువుల్లోన్ కాదు క్రీడలు ,సైన్స్ ఇన్నోవేషన్ లోనూ రాణించాలని ఇటీవల సిఎం కప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలను అభినందించారు. అన్ని గురుకుల పాఠశాలలో NCC,NSS, రెడ్ క్రాస్,తదితర వాటిని ప్రవేశపెడతామని తెలిపారు. జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని గతంలో విజయం సాధించిన వారి జీవితాలను స్టోరీస్ చెప్పారు. విద్యార్థినులు స్టోరీస్ చెప్పారు. అందరూ తమ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలో పలు ఉదాహరణ ప ద్వారా వివరించారు.తమ ప్రభుత్వం విద్య కి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయ నియామకాలు , ప్రమోషన్లు, బదిలీలు చేపట్టిందని అన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. దశాబ్ద కాలం తరువాత విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి డైట్ చార్జీలు పెంచి కామన్ డైట్ అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ దాదాపు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చిన వారే అని చెప్పడంతో నిన్న క్యాబినెట్ లో రైతు భరోసా 10 వేల నుండి 12 వేల కి పెంచడం ,భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12 వేలు ,కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ఇస్తుందని చెప్పడంతో తమ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా తో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి,సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆర్డీవో ,ఎమ్మార్వో తదితర అధికారులు పాల్గొన్నారు..
Comment List