ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు: ఉపముఖ్యమంత్రి భట్టి
By Ram Reddy
On
లోకల్ గైడ్: ఆధునిక దేవాలయాలైన ఐఐటీలకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అంకురార్పణ చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని ఆయన కొనియాడారు.తెలంగాణలో 2030 నాటికి రెండు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే (Green energy investments) లక్ష్యంగా తెలంగాణ సర్కార్ (Telangana Govt) పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. కందిలోని ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad)లో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండ్రోజుల వర్క్‌షాప్ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీ హైదరాబాద్‌తో సింగరేణి ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు
05 Jan 2025 20:52:12
లోకల్ గైడ్:హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
Comment List