రుణమాఫీ, రైతుబంధు, రైతుభరోసా, బోనస్.. అన్నింటా కోతలే: డాక్టర్ కె.లక్ష్మణ్
లోకల్ గైడ్: కాంగ్రెస్ కోతల పాలనతో ఎగవేతల ప్రభుత్వంగా మారడంతో ప్రభుత్వ పథకాలు ఖతమయ్యాయి. రైతులు నిండా మునుగుతున్నారు. రుణమాఫీ, రైతుబంధు, రైతుభరోసా, బోనస్.. అన్నింటా కోతలే.ఇప్పుడు.. తాజాగా జరిగిన కాంగ్రెస్ కేబినెట్ మీటింగులో భూమి లేని రైతు కుటుంబాలకు ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టోలో, డిక్లరేషన్ లో చెప్పిన రూ. 15 వేలకు కోతపెట్టినట్లేనా?కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో రైతుల ఆశలను అడియాసలు చేసింది.రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో 7,500 చొప్పున ఇస్తామని చెప్పి 6,000 కు కుదించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది నిదర్శనం.రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ నీటిమీద రాతలేనని మరోసారి రుజువవుతోంది. రైతులంటే ఎందుకింత కక్ష రేవంత్?ఇప్పటికే రెండు దఫాల రైతు భరోసా ఎగ్గొట్టి రైతులను గోస పెడుతున్న రేవంత్ సర్కార్, ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా అంటూ కొత్తగా మెలిక పెడుతోంది.వరంగల్ డిక్లరేషన్ అబద్దమని తేలింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి మాటలు బూటకమని తేలింది.ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో భూమి ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు, భూమిలేని రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీనిచ్చింది. అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చి మాట తప్పింది. కౌలు రైతులకు రైతు భరోసా దేవుడెరుగు. వానాకాలం సీజన్ ముగిసింది. యాసంగి ముగుస్తోంది. అయినా ప్రభుత్వం రైతు భరోసా ఇయ్యలేదు. ఇంతవరకు నయాపైసా రైతులకు పెట్టుబడి సాయం అందలేదు.దీంతోపాటు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా శాటిలైట్ సర్వే కూడా చేయించాలని నిర్ణయించింది. ఎలాగూ సాగు లెక్కలు తెలిసిపోతాయి.ప్రభుత్వం వద్ద భూముల వివరాలు, పంటల సాగు వివరాలు ఉన్నప్పటికీ, మళ్లీ ఈ దరఖాస్తులు, డిక్లరేషన్లు, ప్రమాణపత్రాలు ఎందుకు?ఫైనల్‌గా రైతు భరోసాను దరఖాస్తు ఆధారంగా ఇస్తారా? లేక ప్రభుత్వం చేసే పంటల సర్వే ఆధారంగా ఇస్తారా? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలి.‘2023 ఎన్నికల సమయంలో ఇదే రేవంత్‌రెడ్డి.. డిసెంబర్ 3 తర్వాత రైతుబంధు డబ్బు లు 5వేలు కాదూ… మేం వస్తే రూ.7,500 ఇస్తాం అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా… కేవలం షరతులు, నిబంధనలు, ఏరివేతలు, వడపోతలు అంటూ మాయమాటలు చెబుతున్నారు.ఇప్పటికే రెండు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టి రైతులను గోస పెట్టిన్రు. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా అంటూ కొత్తగా మెలిక పెడుతోంది.వానాకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టారు.. యాసంగికి పెట్టుబడి సాయం ఇయ్యలేదు. ఇప్పుడు అదిగో.. ఇదిగో అంటూ మళ్లీ కొత్తరాగం అందుకుంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు (మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత వంటి అనేక పథకాలు) అమలు కోసం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి 61 లక్ష మంది నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.మరి ఈ దరఖాస్తుల్లో రైతులకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ మళ్లీ వివరాల పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నట్లు..?ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? ముందు రైతులను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.ఇప్పటికే రైతులకు ఒక్కో ఎకరానికి బాకీ పడ్డ రూ. 17,500 ఎప్పుడు చెల్లిస్తారో ముందు సమాధానం చెప్పండి.రైతు భరోసా ఇచ్చింది లేదు.. రుణమాఫీ చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు..
రాష్ట్రంలోని ప్రతీ రైతుకూ కాంగ్రెస్ ప్రభుత్వం 17,500 రూపాయల రైతుబంధు డబ్బులు బాకీ పడింది.అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన సీఎం రేవంత్.. మూడు విడతలుగా మోసంచేస్తూ.. ఎనిమిది నెలలుగా ఊరించి ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు. సర్కారు లెక్క ప్రకారం రుణమాఫీ అర్హులైన రైతులు 42 లక్షల మంది. మూడు విడతల్లో 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ పూర్తి. నాలుగో విడతలో 3.13 లక్షల మంది రైతులకు మాఫీ. ఇప్పటివరకు రుణమాఫీ పొందిన మొత్తం రైతులు 25.35 లక్షలు. ఇంకా రుణమాఫీ కావాల్సిన రైతులు 16.65 లక్షలు.అసలు గత ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ కన్నా.. రెండు లక్షల రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గింది. దీని వెనుక మతలబు ఏంటి?రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలపై రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలకు రూ. 500 చొప్పున అదనంగా బోనస్ ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా మోసం చేసింది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పంటకు రూ. 500 బోనస్ ఇస్తమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. కనీసం వరిధాన్యానికి కూడా ఇవ్వడం లేదు. కేవలం సన్నరకం ధాన్యానికే బోనస్ అంటూ సన్నాయినొక్కులు నొక్కింది.
తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరు. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్ కు తగిన సమయంలో బుద్ధి చెబుతారు.
Comment List