రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 

రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 

లోక‌ల్ గైడ్: నిరుపేదలకు ఎంతో ముఖ్యమైన అస్త్రం రేషన్ కార్డు. రేషన్ సరుకుల నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందేందుకు ఈ రేషన్ కార్డు ఉండటం అత్యంత అవసరం. అయితే రేషన్‌కార్డు పొందేందుకు ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రేషన్‌కార్డు కోసం మీ సేవల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరికి ఇది ఎలా దరఖాస్తు చేసుకోవాలో.. అసలు రేషన్ కార్డుకు అవసరమైన పత్రాలు ఏంటో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా నూతన వధువు మెట్టింట్లోని రేషన్‌కార్డులో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారికి పుట్టే పిల్లల పేర్లను కూడా యాడ్ చేసుకోవాలి. అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవడం లేదు. ఇప్పటికే ఎంతో మందికి పెళ్లిళ్లు అవడం, పిల్లలు పుట్టడం కూడా జరిగాయి. దీంతో వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చేందుకు ఎదురుచూస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలో రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. దీంతో.. రేషన్ కార్డుకు అవసరమైన పత్రాలు ఏంటి? ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన డాక్యుమెంట్స్

రేషన్ కార్డులో కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలంటూ వారికి సంబంధించిన కొన్ని ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి. భార్య పేరు చేర్చాలనుకుంటే.. తనకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలతో పాటు... వివాహ ధృవీకరణ ప్రతాన్ని చేర్చాల్సి ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లల బర్త సర్టిఫికెట్లను రేషన్‌ కార్డులో చేర్చేందుకు అవసరం అవుతాయి.

ఎలా దరఖాస్తు చేయాలంటే

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రేషన్ కార్డులో కొత్తవారి పేర్లను చేర్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఆఫ్‌లైన్‌లోనే రేషన్‌కార్డును దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసం మీ సేవా కేంద్రాల్లో ఎఫ్‌ఎస్‌సీ కరెక్షన్​ ఫారమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్​ నుంచి కూడా ఈ ఫారమ్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫారమ్‌‌ను నింపండి ఇలా..

ముందుగా మీ రేషన్​ కార్డు నంబర్‌ను మొదటి కాలమ్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెంబర్ ఆడిషన్​ బాక్సులో రైట్​ మార్క్ క్లిక్ చేసి... కొత్తగా చేర్చాలనుకుంటున్న వారి అడ్రస్‌ను రాయాలి. సదరు వ్యక్తి పేరు, ఆధార్ నంబర్ వంటి వివరాలను యాడ్ చేసుకోవాలి. ఫారమ్‌ పూర్తి అయిన తర్వాత అవసరమైన ధ్రువపత్రాలను దానికి జోడించాలి. ఈ ఫారమ్‌ మొత్తాన్ని దగ్గరలోని మీ సేవ కేంద్రాల్లో అందజేయాలి.. అనంతరం వారు ఇచ్చిన రసీదును తీసుకోవాలి. ఈ రసీదును జాగ్రత్త పరచాలి. ఇది పూర్తి అయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది.

ఇలా తెలుసుకోండి...

రేషన్‌కార్డు కోసం దరఖాస్తు ఫారమ్‌ను మీ సేవాలో అందజేసిన తర్వాత మీ స్టేటస్ తెలుసుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. తెలంగాణ అధికారిక https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్‌ను సందర్శించి.. హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న ఫస్ట్ ఆప్షన్​ 'FSC Search' పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు Ration Cards Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్లు​ కనిపిస్తాయి. అందులో FSC Application Search ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ జిల్లా, మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్​ చేస్తే స్టేటస్​ కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న మీ రేషన్​ కార్డు వివరాలను చూసుకోవాలంటే.. FSC Search మీద క్లిక్​ చేసి, లోనికి వెళ్లిన తర్వాత రేషన్ కార్డు కాలమ్‌లో మీ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ చేస్తే.. మీ కావాల్సిన డేటా అంటే రేషన్ కార్డులోని సభ్యుల పేర్లు అక్కడ కనిపిస్తాయి.. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం