క‌విత సంచ‌ల‌న వాఖ్యాలు.....! 

క‌విత సంచ‌ల‌న వాఖ్యాలు.....! 

క‌విత సంచ‌ల‌న వాఖ్యాలు.....! 

లోక‌ల్ గైడ్: బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హించాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయ‌ని, నేను చెప్పిన‌వి త‌ప్ప‌యితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాని క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇందిరా పార్క్ వ‌ద్ద నిర్వ‌హించిన బీసీ మ‌హాస‌భ‌లో క‌విత పాల్గొని ప్ర‌సంగించారు.ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా..? మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు..? మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది అని క‌విత గుర్తు చేశారు.
నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదు.
ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని క‌విత స‌వాల్ విసిరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం