రిషబ్ పంత్ తుఫాన్ హాఫ్ సెంచరీ

 రిషబ్ పంత్ తుఫాన్ హాఫ్ సెంచరీ

లోక‌ల్ గైడ్:శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఐదో టెస్టులో రిషబ్ పంత్ తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సిడ్నీ టెస్ట్‌లో భారత ఆటగాడు చేసిన రెండో ఫాస్టెస్ట్ టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.పంత్ కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. గతంలో 2022లో శ్రీలంకపై 28 బంతుల్లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.ఇది ఆస్ట్రేలియాలో విజిటింగ్ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన అర్ధశతకంగా నిలిచింది. ఇంగ్లండ్‌కు చెందిన జాన్ బ్రౌన్ (1895), రాయ్ ఫ్రెడరిక్స్ (1975) లు గతంలో 33 బంతుల్లో ఈ రికార్డును కలిగి ఉన్నారు.వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఇదే క్రమంలో వచ్చిన ప్రతీ బంతిపై ప్రతాపం చూపించిన రిషబ్ పంత్.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News