మరో జంట విడాకులకు సిద్ధం....!
లోకల్ గైడ్: భారత క్రికెట్ టీమ్‌లో మరో జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో రీల్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న భారత స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) – ధనశ్రీ వర్మ (Dhanashree Verma) జంట విడాకులు తీసుకోబోతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రూమర్స్ నేపథ్యంలో తాజాగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం (Unfollow Each Other On Instagram) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అంతేకాదు ధనశ్రీతో ఉన్న ఫొటోలను కూడా చాహల్ తొలగించాడు. మరోవైపు ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ తెలిపాయి. అందుకు ఖచ్చితమైన కారణాలు మాత్రం చెప్పలేదు. విడాకులు అధికారికం కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు.
చాహల్.. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది.
Comment List