తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి

తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి

 లోకల్ గైడ్ వికారాబాద్ :-ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త, చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే గారి 194వ జయంతి తెలిపిన గీత మహేందర్ చదువుల తల్లికి  శుభాకాంక్షలు తెలిపారు.AIKMS, POW, PDSU ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్ మాట్లాడుతూ దేశంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే మహిళలకు, కార్మికులకు, కర్షకులకు అణగారిన వర్గాలకు చదువు నేర్పిన మొదటి గురువు. కుల నిర్మూలన కొరకు సత్యశోధకు సమాజ్ స్థాపన ఏర్పాటు చేసి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ కుల సమానతల పైన వివక్షత పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యం చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే గొప్ప సంఘసంస్కర్త రోగులకు సేవలు చేస్తూ అదే సేవలలో తను కూడా ప్లేగు వ్యాధికి గురై అమరురాలైన సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో యువత సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కొరకై కృషి చేయాలని అన్నారు.
        ఈ కార్యక్రమంలో AIKMS, POW, PDSU నాయకులు రాములు, గోపాల్, అశోక్, శ్రీకాంత్, వెంకటయ్య, ప్రభావతి, గీత, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
లోక‌ల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం