ఓల్డ్‌ సిటీ మెట్రో భూసేకరణ ప్రక్రియ వేగవంతం

 

లోక‌ల్ గైడ్:ఓల్డ్‌ సిటీ మెట్రో పనులు కొత్త ఏడాదిలో వేగం పుంజుకోనున్నది. జనవరి మొదటి వారంలోనే పరిహారం చెల్లింపులతోపాటు, కూల్చివేతల పనులు మొదలు కానున్నాయి. మెట్రో వల్ల రోడ్డు విస్తరణ ప్రభావితం అవుతున్న వారసత్వ, మతపరమైన కట్టడాలకు నష్టం లేకుండా ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఓల్డ్‌ సిటీ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సాగనున్నాయి.ఓల్డ్‌ సిటీ మెట్రో కూల్చివేతలు కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ సాగుతుండగా, రెండు వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ పెట్టుకున్నది. ఇప్పటికే కొంత మంది యజమానులకు పరిహారం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా... జనవరి రెండు, లేదా మూడో వారంలో తొలి దశ కూల్చివేతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
7.5కిలోమీటర్ల పొడువైన మెట్రో..
ఓల్డ్‌ సిటీ మెట్రో విస్తరణపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల పొడువైన మెట్రోను ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయాణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఫేస్‌-2లో ఇదీ మొదటి కారిడార్‌ కానుండగా ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో 800 ఆస్తులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను పలు దఫాలుగా జిల్లా రెవెన్యూ అధికారులు చేపట్టారు. ఇందులోనూ 400 ఆస్తులకు డిక్లరేషన్‌ పూర్తి చేయగా, ఇందులో 200 ఆస్తులకు పరిహారం అందించనుండగా, మరో 200 ప్రాపర్టీ ఓనర్లతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ప్రిలిమినరీ నోటిఫికేషన్‌లోకి రాని 300 ఆస్తుల సేకరణపై దృష్టి పెట్టారు. మొదటి దశ ఆస్తుల పరిహారానికి చెల్లింపులు మొదలైతే గనుక… ప్రక్రియ వేగం పుంజుకుంటుందని, స్వచ్ఛందంగా యజమానులు కూడా ఆస్తులను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సేకరణకు సానుకూలంగా ఉన్న పలువురు యజమానులు మెట్రో వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
లోక‌ల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం