పారిశుధ్య పనుల్లో జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నాయిని…

పారిశుధ్య పనుల్లో జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నాయిని…

లోకల్ గైడ్,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం:

ప్రజల కల్పించాల్సిన కనీస సౌకర్యాలలో అధికారులు జాప్యం వహిస్తే చర్యలు తప్పవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 58 వ డివిజన్ ఎన్జీవోస్ కాలనీ మరియు రాఘవేంద్ర కాలనీలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు నిర్మాణాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో పర్యటిస్తున్న క్రమంలో విద్యుత్తు సమస్య, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యం ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని నిధుల కేటాయింపు విషయంలో ఆయన కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 183 కోట్ల నిధులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దికి కేటాయించారని తెలిపారు. ప్రధాన సమస్యలను  ఎ,బి,సి విభాగాలుగా విభజించి పనులు చేపట్టామని వివరించారు. పార్టీలకు అతీతంగా నాకు ఓటువేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత అని తెలిపారు. గత పాలకులు పార్టీల పరంగా నిధులను కేటాయించి వివక్ష చూపారని విమర్శించారు. ఈ ఐదేళ్ల కాలంలో పార్టీలు చూడమని, సమస్యలు ప్రతి అసమానతలు లేకుండా చేస్తానని అన్నారు. కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ,విద్యుత్తు సరఫరా వంటి సమస్యల పట్ల అధికారులు దృష్టి సారించాలన్నారు.కల్వర్ట్ నిర్మాణ పనులకు భూమి పూజ57 వ డివిజన్ పరిధిలోని కూడా కాలనీలో మునిసిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి రూ 19 లక్షలతో నూతన బ్రిడ్జ్ (కల్వర్ట్) నిర్మాణానికి భూమి పూజ చేశారు.నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మురికి కాలువ వెంట కలియతిరిగి పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికారులు,కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.