మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం

మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం

-  2025- 26 విద్యా సంవత్సరానికి గాను ఖాళీల భర్తీకి ఆహ్వానం 

-  5 నుండి 9 తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు సదావకాశం 

-  ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలి  

-  మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల బాలికల పాఠశాల (పాల్వంచ) ప్రిన్సిపాల్  ఎన్. ఎ. క్రాంతి

లోకల్ గైడ్ తెలంగాణ,పాల్వంచ :మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల నందు 5,6,7,8,9 తరగతుల  విద్యార్థినీ, విద్యార్థులకు 2025-26 సంవత్సరానికి గాను ఖాళీగా వున్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఎమ్ జె పి టి బిసి బాలికల పాఠశాల (పాల్వంచ) ప్రిన్సిపాల్ ఎన్.ఎ. క్రాంతి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.5 నుండి 9 వ, తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో  విద్యార్థుల ప్రవేశం కొరకు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ 20 తేదీన  జరిగే ప్రవేశ పరీక్ష నందు ప్రతిభ కనబర్చిన, రిజర్వేషన్ ఆధారితంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రవేశాల కొరకు ఈ క్రింది వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. https://mjptbcadmissions.org/ లేదా www.mjptbcwrels.telangana.gov.in

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.