అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి  

టీజేయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పోతుల దిలీప్ యాదవ్.

అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి  

లోకల్ గైడ్ తెలంగాణ, మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టిజేయూ) మహబూబాబాద్ జిల్లా   కేంద్రంలో ఆదివారం జరిగిన  సమావేశంలో  తెలంగాణ జర్నలిస్ట్  యూనియన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు  పోతుల దిలీప్ మాట్లాడుతూ..  జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. ఉన్న సమస్యలను వెలికి తీసి, ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జర్నలిస్టు పనిచేయాలని  ఆయన అన్నారు.  అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు మహబూబాబాద్ జిల్లాలో  బిలో ప్రాపర్టీ కింద  అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని  తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు పోతుల దిలీప్ యాదవ్  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి  చల్ల గోవర్ధన్ యాదవ్,  ఉపాధ్యక్షులు దొంతు నరసయ్య, సహాయ కార్యదర్శి మట్ల కిషోర్,  కోశాధికారి చిలకామారి  గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.