ఆరోగ్యంపై మహిళలందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. 

ఆరోగ్యంపై మహిళలందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

మహిళా శక్తి  ఏర్పాటుచేసిన క్యాంటీన్ల సందర్శన. 

లోకల్ గైడ్ తెలంగాణ:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్  అభిలాష అభినవ్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి, అలాగే వారి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి వైద్య శిబిరం ఎంతో సహాయపడుతుందని కలెక్టర్ అన్నారు. బీపీ, కంటి, రక్తపరీక్షలు, వైద్య సేవలు అందించడం మహిళా ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో కీలకమైనవని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో మహిళల సాధారణ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వైద్యులు కలెక్టర్ కు బిపి, రక్త పరీక్షలు నిర్వహించారు.అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ మహిళా శక్తి క్యాంటీన్లో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టి స్టాల్ కలెక్టర్ సందర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. రాజేందర్, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అశోక్ కుమార్, శంకరయ్య, డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్, డిసిఎచ్ ఎస్ డా. బి సురేష్, ఏవో సూర్యారావు, అధికారులు, సిబ్బంది తదితరులు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
లోకల్ గైడ్ తెలంగాణ,మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో  సంబంధిత...
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి